రాష్ట్రవ్యాప్తంగా 44,170 చెరువులున్నాయని, అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 3,391, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 514 చెరువులు ఉన్నాయని రైతు కమిషన్ తెలిపింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత చిన్న నీటి పారుదల వ్యవస్థను భారీ నీటి పారుదల వ్యవస్థలో విలీనం చేయడం వల్ల నిర్వహణలో లోపాలు చోటుచేసుకున్నాయని, చెరువుల పరిరక్షణకు ప్రత్యేకంగా చిన్న నీటి పారుదల చట్టాన్ని రూపొందించాలని సర్కారుకు సిఫార్సు చేసింది.
Background & Critical Questions - బడా బాబుల సంగతేంటి?
గత ప్రభుత్వం తప్పులు చేసింది సరే, మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? చెరువులోకి వాటర్ రావడానికి, పోవడానికి దారులు మూసేసి.. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో లేకుండా చెరువును ఆక్రమించిన బడా బాబులను వదిలేసి, కేవలం పేద, మధ్యతరగతి ప్రజలు కట్టుకున్న ఇళ్లను కూల్చడం ఎంతవరకు తగును?
ఫాతిమా కాలేజీ సంగతి ఏమైంది?
VERTEX కంపెనీ ఒక దగ్గర నాలానే లేపేసి విల్లాలు కడుతుంది, దాని పరిస్థితి ఏంటి?
శేరిలింగంపల్లి MRO మరియు మున్సిపల్ ఆఫీస్‌కి కూతవెూత దూరంలో చెరువుల్లో పెద్ద పెద్ద టవర్స్ వెలిశాయి, వాటి సంగతి ఏంటి?
ఇలా చెప్పుకుంటూపోతే హైదరాబాద్‌లో ప్రతి చెరువు పరిస్థితి అలాగే ఉంది. నిబంధనలు పేదలకు మాత్రమే వర్తిస్తాయా? బడా బాబుల ఆక్రమణలపై ప్రభుత్వం ఎప్పుడు కొరడా జులిపిస్తున్నారు.









